Chiranjeevi, Mahesh Babu: మెగాస్టార్ మహేష్ కాంబో వర్కవుట్ అవుతుందా..?

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవికి మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే. రీఎంట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సక్సెస్ లతో వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ఈతరం హీరోల్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోగా మహేష్ బాబు పేరును సంపాదించుకున్నారు. మెగాస్టార్, మహేష్ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

శ్రీనువైట్ల కొన్నేళ్ల క్రితం చిరంజీవితో అందరివాడు సినిమాను తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద అందరివాడు ఫ్లాప్ గా నిలిచింది. మరోవైపు మహేష్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో దూకుడు, ఆగడు సినిమాలు తెరకెక్కగా దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆగడు డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం డి అండ్ డి సినిమాతో బిజీగా ఉన్న శ్రీను వైట్ల ఈ సినిమాతో సక్సెస్ సాధించి చిరు, మహేష్ తో మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేయనున్నారు.

శ్రీనువైట్ల మల్టీస్టారర్ కథలో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు ఓకే చెబుతారా..? లేదా..? చూడాల్సి ఉంది. శ్రీనువైట్ల చెప్పే కథ అద్భుతంగా ఉంటే మాత్రం మహేష్ బాబు, చిరంజీవి నో చెప్పే అవకాశాలు అయితే ఉండవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. చిరు, మహేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus