మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలిసి ఇటీవల పెళ్ళి వేడుకలో సందడి చేశారు.వివరాల్లోకి వెళితే… మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కొడుకు వెంకట్రామ్ పెళ్ళి రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్, పవర్‌స్టార్ లు హాజరుకావడంతో.. ఈ వేడుకకి మరింత కళ చేకూరిందనే చెప్పాలి. నవ్వుతూ వీళ్ళు ఫోటోలకి ఫోజులిచ్చారు. పవన్ భుజం పై చెయ్యి వేసి చిరు మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో అయితే హైలెట్ గా నిలిచింది.
అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ సభ్యులందరితో చిరు, పవన్ లు ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ మురిసిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ మెగా బ్రదర్స్ ఇద్దరూ మూడేసి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి.. ‘ఆచార్య’ తో పాటు ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అటు తర్వాత దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా చేస్తారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ‘భీమ్లా నాయక్’ ‘హరి హర వీరమల్లు’ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ వంటి చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా తన ‘జనసేన’ పార్టీని బలోపేతం చేసే పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
1
2
3
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?