ఈరోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన చిరంజీవి, సాయి ధరమ్ తేజ్

అనుకోకుండా చేశారో, అనుకోని చేశారో తెలియదు గానీ మామ అల్లుళ్లు ఈరోజు తమ కొత్త సినిమాలను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తరవాత చేయనున్న సినిమాకి ఈరోజు మధ్యాహ్నం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, పరుచూరి బ్రదర్స్ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం లోగోని చిరంజీవి పుట్టినరోజు(ఆగస్టు 22) న రిలీజ్ చేయనున్నారు. ఇక వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవలే జవాన్ సినిమాను కంప్లీట్ చేశారు.

గత వారం స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు. ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకముందే కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పణలో వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus