Chiranjeevi, Sukumar: సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్.. పనైపోయింది.!

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో ఉన్న కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. కేవలం సీనియర్ దర్శకులతో మాత్రమే కాకుండా నేటి తరం యువ దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలతోనే సరికొత్త కంటెంట్ ఉన్న కథలను ప్రేక్షకులకు అందించాలనే మెగాస్టార్ పడుతున్న తాపత్రయం హాట్ టాపిక్ గా మారుతొంది.

Click Here To Watch NOW

ఒక విధంగా యువ హీరోల కంటే వేగంగా ఆయన సినిమాల షూటింగ్ లో కనిపిస్తూ ఉండడం విశేషం. మొత్తానికి సుకుమార్ దర్శకత్వంలో కూడా ఇటీవల షూటింగ్ పనులను పూర్తి చేసుకోవడం విశేషం. ఇదివరకే దర్శకుడు సుకుమార్ ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరి కలయికలో ఓ సినిమా రాబోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది సినిమా కాదు. కేవలం ఒక యాడ్ కోసమే ఇద్దరూ కలిసి వర్క్ చేయడం జరిగింది.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శుభగ్రహ యాడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించడం జరిగింది. అయితే ఆ యాడ్ కోసం సుకుమార్ డైరెక్షన్ చేశాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలియ జేశారు. ‘దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా షూటింగ్ కి సంబంధించిన రెండు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త స్టైల్ లో కనిపించడం విశేషం. ఒకవిధంగా ఆయన పాతికేళ్లు వెనక్కి వెళ్ళినట్లు గా అనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ తదుపరి సినిమా ఆచార్య ఏప్రిల్ 29వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus