Chiranjeevi Wedding Anniversary: చిరు- సురేఖ..ల పెళ్లి రోజు వేడుకల్లో నాగార్జున ఫ్యామిలీ సందడి.. ఫోటోలు వైరల్!

1980 ఫిబ్రవరి 20న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) .. సురేఖని పెళ్లాడారు. ఈరోజు వీరి పెళ్లి రోజు. తమ 45వ పెళ్లి రోజు వేడుకలను ఈ జంట దుబాయ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో తమ ఫ్లైట్లో దుబాయ్ కి పయనమైంది ఈ జంట. వీరితో తమకి అత్యంత సన్నిహితులు కూడా తీసుకువెళ్తున్నారు. చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ.. “సురేఖ లాంటి భార్య నా జీవితంలోకి రావాలని కలలుగనే వాడిని. ఆ అదృష్టం నాకు దక్కింది.

Chiranjeevi Wedding Anniversary:

ఆమె నా బలం, నా ధైర్యం. నా నమ్మకం. ప్రపంచంలో చాలా మందికి తెలియని గొప్ప విషయాలు నేను తెలుసుకోవాలి అని పరితపిస్తుంటుంది. అందుకు తన వంతు సాయం కూడా చేస్తుంటుంది. నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలిపేందుకు ఈ మధుర క్షణాలే సాక్ష్యం. థాంక్యూ మై డియర్ సోల్ మేట్.! ఈసారి నాకు ఇష్టమైన వారితో మా పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఫ్లైట్లో తీసుకున్న క్రింది ఫోటోలు షేర్ చేశారు.

ఇందులో నాగార్జున (Nagarjuna), అమల (Amala Akkineni) హైలెట్ అయ్యారు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) సతీమణి నమ్రత (Namrata Shirodkar) కూడా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులకి సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ (Vishwambhara) విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus