రాధ డ్యాన్స్‌కి ఫిదా అయిపోయిన చిరంజీవి, వెంకటేష్.. వీడియో వైరల్..!

గత కొన్నేళ్లుగా 80వ దశకంలో హీరోలుగా, హీరోయిన్స్‌గా నటించిన సౌత్ స్టార్స్ అందరూ రీ యూనిమన్ పార్టీ పేరుతో ప్రతి ఏటా కలుస్తున్న సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ రీ యూనియన్ పార్టీ జరగట్లేదు. ఇటీవలే అప్పటి తారలంతా మళ్లీ కలిశారు. ఈసారి ముంబైలోని జాకీ ష్రాఫ్ ఇళ్లు వారికి వేదికైంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సీనియర్ నరేష్, రాధ, శోభన, సుమలత, రమ్యకృష్ణ, మధుబాల లాంటి నాయకా నాయికలు అంతా కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే..

వాళ్లంతా కలిసి హంగామా చేసిన పిక్స్ సామాజిక మాధ్యమాలలో ఎంతలా వైరల్ అయ్యాయో చూశాం. మెగాస్టార్ చిరు, యాక్షన్ కింగ్ అర్జున్, శివగామి రమ్యకృష్ణలతో కలిసి పార్టీ మూడ్‌లో స్టెప్టులేస్తూ.. ఫుల్ చిల్ అవుతున్న ఇమేజ్ మధుబాల షేర్ చేయగా నెట్టింట బీభత్సంగా వైరల్ అయింది. ఈ రీయూనియన్ పార్టీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ.. ఆశా భోంస్లే పాడిన ‘సజనా హై ముజే’ పాటకు డ్యాన్స్ చేశారు.

ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అనిపించేలా రాధ హుషారుగా స్టెప్పులేస్తుంటే.. చుట్టూ ఉన్న స్టార్లంతా ఈలలు, అరుపులు, కేరింతలతో రాధలో జోష్ నింపుతూ ఎంజాయ్ చేశారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. నాకిష్టమైన పాటకు డ్యాన్స్ చేసే అవకాశమొచ్చింది.. నా స్నేహితులందరూ నాపై అభిమానం చూపించారు అంటూ రాధ ఈ వీడియో షేర్ చేశారు.

వీడియో చివర్లో వెంకటేష్ వచ్చి ఓచిన్న పూలమాల రాధ మెడలో వేసి వెళ్లాడు. మెగాస్టార్ చిరంజీవి వచ్చి.. రాధను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. రీల్ లైఫ్‌లో చిరుతో పోటీగా డ్యాన్స్ చేసే ఏకైక హీరోయిన్ రాధ అనే పేరుంది పరిశ్రమలో.. అలాంటి రాధ రియల్ లైఫ్‌లో తన డ్యాన్స్‌‌తో మెగాస్టార్‌ని మెప్పించడం విశేషం.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus