Chiranjeevi, Boyapati Srinu: చిరంజీవికి కథ చెప్పనున్న బోయపాటి.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అఖండ సినిమాతో బోయపాటి శ్రీను ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. నైజాం ఏరియాలో ఇప్పటికే అఖండ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం గమనార్హం. నైజాం ఏరియాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. బోయపాటి శ్రీను తర్వాత సినిమా ఇప్పటివరకు ఫిక్స్ కాలేదు. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ అని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియదు.

అయితే బోయపాటి శ్రీను త్వరలో మెగాస్టార్ చిరంజీవిని కలిసి కథ చెప్పనున్నారని సమాచారం. అయితే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తైన తర్వాతే చిరు బోయపాటి కాంబో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉంది. గతంలోనే చిరంజీవి బోయపాటి కాంబోలో ఒక మూవీ తెరకెకాల్సి ఉన్నా కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ గ్రాండ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. యంగ్ హీరోలతో పోలిస్తే సీనియర్ హీరోలతో పని చేసిన సమయంలో బోయపాటి శ్రీను ఎక్కువగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus