మెగాస్టార్ చిరంజీవి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి సినిమాలు చేశారు. 2017 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం 104 కోట్ల షేర్ ను వసూల్ చేసి అప్పటి ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ అయిన మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ రికార్డు ని బ్రేక్ చేసింది. ఇక ‘సైరా’ హై బడ్జెట్ వల్ల నష్టాలను మిగిల్చినప్పటికీ.. భాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి. ప్రమోషన్ చేసుంటే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉండేదేమో. ఇది పక్కన పెడితే తన 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయడానికి మెగాస్టార్ రెడీ అవుతున్నారు.
‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెగాస్టార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని.. ఓ సోషల్ మెసేజ్ తో పాటు మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి కొరటాల తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ కు గాను మెగాస్టార్ 4 ఏరియాల్లో మొదటి వారం షేర్ ను తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇది ఎంత కాదనుకున్నా.. 55 కోట్ల నుండీ 60 కోట్ల వరకూ ఉంటుందట. ఇక మరో వైపు పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ కోసం 40 కోట్ల నుండీ 45 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ హైయెస్ట్ అనుకుంటే.. ఇప్పుడు మెగాస్టార్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది.