Chiranjeevi: జగన్ మీటింగ్ అనంతరం చిరు షాకింగ్ కామెంట్

మెగాస్టార్ చిరంజీవి గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఇండస్ట్రీ తరపున మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి భేటీ గంటా 20 నిమిషాల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ మంచి వాతావ‌ర‌ణంలో స‌మావేశం జ‌రిగిందని సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం సంతృప్తిని క‌లిగించిందని అన్నారు. ఇక సామాన్య ప్ర‌జ‌ల‌కు వినోదం అందుబాటులో ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నాను అంటూ సీఎం ప్ర‌య‌త్నానికి అభినంద‌న‌లు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

ఏదో మంచి చేయాల‌న్న ఆలోచ‌న ప్ర‌భుత్వం వైపు నుంచి ఉందని అంటూ తాను ఒక ప‌క్షాన ఉండ‌నని, అంద‌రినీ స‌మ‌దృష్టితో చూస్తాన‌ని అలాగే భ‌య‌ప‌డొద్ద‌ని భ‌రోసా కూడా ఇచ్చినట్లు మెగాస్టార్ తెలియజేశారు. సీఎం మాట‌లు నాకు ధైర్యమిచ్చిందని చెప్పిన మెగాస్టార్ సినీ పరిశ్రమలలో ఉన్న అన్ని రకాల సమస్యల జగన్ గారికి వివరించానని ఆయన పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారాని అన్నారు. ఇక జీఓ 35 గురుంచి పునారలోచిస్తా అని హామీ ఇచ్చినట్లు చెబుతూ..

సమస్య పరిష్కరించే వరకు దయచేసి ఎవరు మాట్లాడొద్దని, ఇండస్ట్రీ లో ఎవరు కూడా దయచేసి ప్రభుత్వం పై కామెంట్ లు చెయ్యొద్దు అన్నారు. ఒక వారంలో లేదా పది రోజుల్లో మనకి ఆమోద యోగ్యం అయిన G.O వస్తుందని ఇండస్ట్రీ బ‌య‌ట‌కు క‌న్పించేంత గ్లామ‌ర్ ఫీల్డ్ కాదని ఇక్కడ రెక్కాడితేకాని డొక్కాడ‌ని కార్మికులు కూడా ఉన్నారని అన్నారు. ఇక క‌రోనా స‌మ‌యంలో సినీ కార్మికులు ఇబ్బందులు ప‌డ్డారని అంటూ సినీ ఇండ‌స్ట్రీలో ఉన్నవారంతా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వొద్దు.

అంద‌రూ సంయ‌మ‌నం పాటించండి. ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ఎగ్జిబిట‌ర్ల ప్ర‌తినిథుల‌ను పిలిచి సీఎం మరోసారి మీటింగ్ పెడ‌తామ‌న్నారు. స‌మ‌స్య‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుంది అని చిరంజీవి వివరణ ఇచ్చారు. ఇక .మెగాస్టార్ ఇచ్చిన క్లారిటీపై ఓ వర్గం వారి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ టికెట్ల విషయంలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వగా ఇప్పుడు ఎవరు ఎమోద్దని మెగాస్టార్ చెప్పడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus