కొత్త సినిమాల మేకింగ్ ను కనుక గమనిస్తే.. ఎవరికైనా చాలా విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా కొత్త నటీనటుల నుండి మంచి నటన రాబట్టుకోవాలంటే.. దర్శకులు రకరకాల ఫార్ములాస్ ఉపయోగిస్తారు. అవసరమనుకుంటే సీన్ వివరించిన తర్వాత కొన్ని రిఫరెన్స్ లు చెబుతారు. ‘పలనా సినిమాలో ఇలాంటి సన్నివేశానికి ఆ నటుడు ఎలా హావభావాలు పలికించాడో.. అలా నువ్వు ఇప్పుడు ఈ సన్నివేశానికి చెయ్యాలి’ అంటూ చెబుతారు. ఇది కొత్త విషయం కాదు.
మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చరణ్ కూడా కొంతమంది డైరెక్టర్స్ ‘తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాల్లోని సీన్స్ ను చెప్పి అలా నటించాలని కోరతారంటూ’ అతను చెప్పుకొచ్చాడు. అక్కడ చిరంజీవి గొప్పతనం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ చిరంజీవికి కూడా ఓ హీరోకి సంబంధించిన రిఫరెన్స్ లు చెప్పి చేయించుకున్న సందర్భాలు ఉన్నాయట. ఆ హీరో మరెవరో కాదు రాజేంద్రప్రసాద్. అవును మన నటన కిరీటి పేరు చెప్పగానే కామెడీ గుర్తుకొస్తుంది.
చిరంజీవి (Chiranjeevi) పేరు చెప్పగానే డాన్సులు, ఫైట్లు గుర్తుకొస్తాయి. అయితే కెరీర్ ప్రారంభంలో చిరు కామెడీ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు చిరంజీవికి… రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ గురించి చెప్పి ఆయనలా నీ స్టైల్ లో కామెడీ చెయ్యి అని చెప్పాడట. దీంతో చిరు.. రాజేంద్రప్రసాద్ స్టైల్లో కామెడీ చేసి చూపించగా.. ఆ సీన్ ఓకే అయిపోయిందట. ఈ విషయాన్ని గతంలో చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరూ కలిసి ‘డాడీ’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాల్లో నటించారు.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!