మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర (Vishwambhara) సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఒకే ఒక్క సినిమాకు దర్శకునిగా పని చేసిన అనుభవం ఉన్న మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) రెండో సినిమాకే తన టాలెంట్ తో చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నారు. విశ్వంభర సినిమాలో చిరంజీవి లుక్ ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే విడుదలైన ఫోటోల ద్వారా క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela) ఇప్పటికే చిరంజీవి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు నిర్మాతగా కూడా అభిరుచిని చాటుకుంటున్నారు.
చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ సినిమాను నిర్మించి హిట్ ఖాతాలో వేసుకోవాలని సుస్మిత ఆకాంక్ష కాగా రాబోయే రోజుల్లో ఆమె కల నెరవేరనుందని తెలుస్తోంది. సుస్మిత ఇప్పటికే కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తాజాగా బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇదో అద్భుతమైన ప్రయాణం అంటూ ఎగ్జైట్ అయ్యారు. హైదరాబాద్ లో స్టూడియో అనంత పేరుతో ఒక ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభం కాగా ఈ ఫిట్ నెస్ సెంటర్ లో భాగమైనందుకు థ్రిల్లింగ్ గా ఉందని శ్రీజ చెప్పుకొచ్చారు.
శ్రీజ ఈ వ్యాపారంలో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఇప్పుడు మాత్రం వ్యాపార రంగంలో అడుగుపెట్టడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. మెగా హీరోల సపోర్ట్ తో శ్రీజ వ్యాపార రంగంలో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనా అధిగమించి రాణిస్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శ్రీజ భవిష్యత్తులో మరిన్ని వ్యాపారాలలో ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.