Market Mahalakshmi Review in Telugu: మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!
April 19, 2024 / 12:05 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
పార్వతీశం (Hero)
ప్రణీక అన్విక (Heroine)
హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు (Cast)
వి ఎస్ ముఖేష్ (Director)
అఖిలేష్ కలారు (Producer)
జో ఎన్మవ్ (Music)
సురేంద్ర చిలుముల (Cinematography)
Release Date : ఏప్రిల్ 19, 2024
‘కేరింత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతీశం (Parvateesam) . ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు కానీ అవి అతని కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు. అయితే కొంచెం గ్యాప్ తీసుకుని ‘మార్కెట్ మహాలక్ష్మీ’ (Market Mahalakshmi) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్స్ తో కొంచెం సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ సినిమా ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతి కలిగించింది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
కథ : హీరో(పార్వతీశం.. సినిమాలో అతనికి పేరు ఉండదు) ప్రభుత్వ ఆఫీసులో గుమాస్తాగా పని చేసే వ్యక్తి(కేదార్ శంకర్) (Kedar Shankar) కొడుకు. ఆ గుమాస్తా తన కొడుక్కి ఎక్కువ కట్నం తెచ్చిపెట్టే అమ్మాయితో పెళ్లి చేయాలని.. ఆ విధంగా తన కొడుక్కి చిన్నప్పటి నుండి పెట్టిన ఖర్చులు మొత్తం వెనక్కి రాబట్టాలని భావిస్తాడు. కానీ హీరో మార్కెట్‌లో కూరగాయలు అమ్మే మహాలక్ష్మి(ప్రణీక అన్విక)తో ప్రేమలో పడతాడు.కానీ మహాలక్ష్మి చాలా కఠినంగా ఉంటుంది. మార్కెట్లో అందరితో గొడవలు పెట్టుకునే నైజం ఆమెది.
ఆమె తండ్రి పక్షవాతంతో మంచాన పడటం, ఆమె అన్న కృష్ణ(మహబూబ్ బాషా) (Mahaboob Basha) తాగుడుకు బానిస అయిపోవడంతో కుటుంబ బాధ్యత ఆమె తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆమె కఠినంగా మారిపోతుంది. అలాంటి అమ్మాయిని హీరో ఎలా ప్రేమలో పడేశాడు. ప్రేమించిన అమ్మాయి కంటే కఠినమైన అతని తండ్రిని ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : గ్యాప్ వచ్చినప్పటికీ పార్వతీశం నటనలో మార్పు ఏమీ రాలేదు. ఎప్పటిలానే హుషారుగా నటించాడు. కొన్ని చోట్ల నవ్వించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేశాడు. హీరోయిన్ ప్రణిక అన్విక గడసరి అమ్మాయిగా బాగానే నటించింది. కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆమె వరకు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కేదార్ శంకర్ కి ‘ఆమె’ లో కోటా శ్రీనివాసరావు టైపు పాత్ర లభించింది. ఈ పాత్రని ఇంకా పొడిగించి.. కామెడీ పండించే స్కోప్ ఉన్నా ఎందుకో దర్శకుడు ఆ స్టెప్ తీసుకోలేదు.
అయినప్పటికీ కేదార్ శంకర్ హీరో, హీరోయిన్ల కంటే ఎక్కువ మార్కులే వేయించుకుంటాడు. హీరో ఫ్రెండ్ ముక్కు అవినాష్(Mukku Avinash) , హీరోయిన్ అన్నగా మహబూబ్ బాషా .. తమ మార్క్ కామెడీతో అలరించారు. ‘సలార్’ ఫేమ్ పూజా విశ్వేశ్వర్ కూడా ఇందులో కసక్ కస్తూరి అనే పాత్రలో కొంచెం కామెడీ పండించడం విశేషం. హర్షవర్ధన్ (Harsha Vardhan) , , జయ (Jaya Naidu) , పద్మ వంటి వారు కూడా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ముఖేష్ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. కానీ ఇప్పటి కుర్రకారుకి నచ్చేలా హ్యూమర్ ని జెనరేట్ చేస్తూ.. ఈ చిత్రాన్ని ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది.నిజజీవితంలో తన స్నేహితుడికి జరిగిన ఓ సంఘటనని ఆధారం చేసుకుని, కేవలం 26 రోజుల్లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట దర్శకుడు ముఖేష్. ఆ రకంగా కూడా అతన్ని అభినందించాల్సిందే.
మరోపక్క సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. జో ఎన్మవ్ సంగీతం కూడా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాత అఖిలేష్ కలారు కథకి ఎంత కావాలో అంతా పెట్టారు. నిర్మాణ విలువల విషయంలో కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు.
విశ్లేషణ : ‘మార్కెట్ మహాలక్ష్మీ’ ఓ యూనిక్ పాయింట్ తో తెరకెక్కిన డీసెంట్ రామ్ – కామ్ ఎంటర్టైనర్. కామెడీ, సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్స్ కావడంతో…. ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేసే విధంగానే ఉంది అని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus