దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి, చంద్ర వెంపతీ తదితరులు (Cast)
బీఎస్ సర్వాంగ కుమార్ (Director)
క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Producer)
అజయ్ అర్సాడా (Music)
ఎస్ ఎస్ మనోజ్ (Cinematography)
Release Date : ఏప్రిల్ 19, 2024
ఈ వారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే వార్తల్లో ఉన్నాయి. మిగిలిన వాటికి మినిమమ్ బజ్ కూడా లేదు. మరోపక్క ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) కూడా ఒకటి. స్టార్ కమెడియన్ అభినవ్ గోమఠం (Abhinav Gomatam) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : విశాల్ (నిఖిల్ గాజుల) ఓ డాక్టర్. అతనితో రిలేషన్షిప్‌లో ఉంటుంది సుజాత (శాలినీ కొండెపూడి)(Shalini Kondepudi). అయితే విశాల్… ఏదో ఒక కారణం చెప్పి సుజాతని ఇగ్నోర్ చేస్తుంటాడు. అది ఆమెకు ఆలస్యంగా అర్థమవుతుంది. దీంతో బాధ పడుతూ ఆమె ఇంటికి వస్తుంది. ఆ టైంలో ఆమె ఇంట్లో సురేష్ (అభినవ్ గోమఠం) అనే దొంగ పడతాడు. అతన్ని చూడగానే ఆమె షాక్ కి గురవుతుంది. అయితే తర్వాత సురేష్ కథ విని అతనికి ఇంప్రెస్ అవుతుంది సుజాత.
ఆ తర్వాతి రోజు సుజాత బర్త్ డే. దీంతో ఆమెకు విషెస్ చెప్పేందుకు సుజాత బాయ్ ఫ్రెండ్ విశాల్,సుజాత బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి (దివ్య శ్రీపాద)(Divya Sripada) , బుజ్జి బాయ్ ఫ్రెండ్ వరుణ్ (శశాంక్ మండూరి)..లు ఇంటికి వస్తారు. వాళ్ళను చూసి వెళ్ళిపోతానని సురేష్… సుజాతకి చెప్పినప్పటికీ ఆమె వినదు. ‘ఏమీ కాదులే అని ఉండమంటుంది..?’ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : అభినవ్ గోమఠం నటన గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఎప్పటిలానే తన కామెడీ టైమింగ్ తో వన్ మెన్ షో చేసేశాడు. ఎక్కడా కూడా అతని హై అనేది తగ్గలేదు. ఎక్కువ శాతం కూడా అతనే కనిపిస్తాడు. ఇక శాలినీ కొండెపూడి లుక్స్ ఎలా ఉన్నా కామెడీ టైమింగ్ తో మెస్మరైజ్ చేసింది.
ఇక దివ్య శ్రీపాద మరోసారి తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. నిఖిల్ గాజుల కూడా పర్వాలేదు అనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ నటనతో పాస్ మార్కులు వేయించుకున్నారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ ఎంపిక చేసుకున్న పాయింట్ పెద్ద వెయిట్ ఉన్నది ఏమీ కాదు. చాలా సింపుల్ కథ. దానికి తగ్గట్టే సన్నివేశాలు కూడా చాలా ఎంగేజింగ్ గా రాసుకున్నాడు. కామెడీ కూడా సమపాళ్లలో ఉంది. డైలాగ్స్ కూడా ఇంప్రెస్ చేసే విధంగానే ఉన్నాయి. అజయ్ అరసాడ సంగీతం బాగానే ఉంది.
అలా అని పాటలు గుర్తుంచుకునే విధంగా ఏమీ ఉండవు. ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. మహేశ్వర్‌రెడ్డి గోజల నిర్మాణ విలువలు కూడా కథకి తగ్గట్టు కూడా బాగానే కుదిరాయి.
విశ్లేషణ : ముందుగా చెప్పుకున్నట్టు ‘మై డియర్ దొంగ’ చాలా సింపుల్ కథతో రూపొందింది. ఎమోషనల్ గా డెప్త్ లేకపోయినా కామెడీతో టైం పాస్ చేయిస్తుంది. రన్ టైం కూడా తక్కువే కాబట్టి.. ఈ వీకెండ్ కి ‘ఆహా’ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని ఒకసారి చూసేయండి.
రేటింగ్ : 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus