Sushmitha, Krithi Shetty: మెగాస్టార్ కూతురితో కృతిశెట్టి సినిమా!

‘ఉప్పెన’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి. ఈ సినిమా తరువాత కృతికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. యంగ్ హీరోలు నాని, సుధీర్ బాబు లాంటి హీరోలతో కలిసి నటిస్తోంది ఈ బ్యూటీ. అలానే తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

అది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా కొన్ని సినిమాలకు పని చేసింది. ఆ తరువాత నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయింది. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తోన్న సుష్మిత కొణిదెల ఇప్పుడు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను టేకప్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సబ్జెక్ట్ ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉంది. ఒక్కసారి ప్రాజెక్ట్ ఓకే అయితే గనుక షూటింగ్ మొదలవుతుంది.

ఈ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. దాదాపు ఆమెనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. అలానే కథకు తగిన హీరో కోసం వెతుకుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus