Chiranjeevi: ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి!

మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. చిరంజీవి సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా వీరాభిమనులు ఉండగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోలలో చిరంజీవి ఒకరు. అయితే చిరంజీవి నటించబోతున్న వేదాళం రీమేక్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ సంతోషంగా లేరు. గత రెండు రోజులుగా చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ కు ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.

వేదాళం రొటీన్ మాస్ మసాలా సినిమా కావడంతో ఈ సినిమాలో చిరంజీవి నటించకుండా ఉంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ లో ఎక్కువమంది భావిస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ కావడం కూడా ఫ్యాన్స్ ను కంగారు పెడుతోంది. చిరంజీవి నవ్యత ఉన్న కథలను ఎంచుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య వయస్సులో వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ సూట్ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని వార్తలు వస్తుండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus