Chiranjeevi: ఎట్టకేలకు కూతురికి సినిమా ఓకే చేసిన చిరు… సమ్మర్‌లో స్టార్ట్‌!

Ad not loaded.

చిరంజీవి (Chiranjeevi)  ఏదైనా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వస్తున్నారు అంటే రెండు రకాల ఉత్సుతకలు ఉంటాయి. ఒకటి ఆ సినిమా గురించి ఏం చెబుతారు అని, రెండో ఆయన లీక్స్‌ ఏంటని. అలా ‘లైలా’ (Laila)  సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కూడా చిరంజీవి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వాటితోపాటు చిరు లీక్స్‌ అలియాస్‌ మెగా అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. అదే అందరికీ తెలిసిన తన రాబోయే సినిమా. అదేనండీ అనిల్‌ రావిపూడి సినిమా. దాంతోపాటు లాంగ్‌ వెయిటెడ్‌ ఇన్ఫో కూడా ఇచ్చేశారు.

Chiranjeevi

‘విశ్వంభర’ (Vishwambhara)  సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమాలో నటిస్తారు అనే డౌట్‌కి ఎప్పుడో చిన్నపాటి క్లారిటీ వచ్చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా ప్రచారం సమయంలో అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  చెప్పేశారు. ఇప్పుడు అఫీషియల్‌గా లీక్‌ ఇచ్చారు. సాహు గారపాటి (Sahu Garapati)  నిర్మాణంలో అనిల్‌ రావిపూడి సినిమాలో నటిస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు ఆ సినిమాకు తన కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది అని కూడా చెప్పారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాను. రిలీజ్ ఎప్పుడు, ఏంటనేది మరో లీక్‌లో చెబుతాను. (వచ్చే సంక్రాంతికి వస్తాం అని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు అనుకోండి) సినిమాను సమ్మర్‌లో ప్రారంభిస్తాం. సినిమా ఆద్యంతం కామెడీతో నిండి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్‌ ప్లెజ్డ్ కామెడీ సినిమా చేస్తున్నాను. అనిల్ సీన్స్ చెప్పినప్పుడల్లా పగలబడి నవ్వాను అని చెప్పారు చిరంజీవి. గతంలో తనకు, కోదండరామి రెడ్డితో ఉన్న బంధం..

ఇప్పుడు అనిల్‌కు తనకు ఏర్పడింది అని చిరు అన్నారు. ఇక ఈ సినిమాలో కామాక్షి భాస్కర్లను (Kamakshi Bhaskarla) ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకుంటున్నాం అని కూడా చెప్పేశారు. తమ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్‌కి కామాక్షి బాగుంటుంది అని అనిల్ రావిపూడి అన్నారని.. ఆమెను సినిమాలో భాగం చేస్తున్నాం అని చిరంజీవి చెప్పారు. ఈ సమ్మర్‌లో సినిమా ప్రారంభిస్తాం అని కూడా చెప్పారు. అంటే సమ్మర్‌ టైమ్‌లోనే అంటే మే9న ‘విశ్వంభర’ వచ్చేయొచ్చు అని టాక్‌.

‘లైలా’ ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus