మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రం రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇది ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన మూవీనే..! కానీ చిరు ఇమేజ్ కు ఇది సెట్ అవుతుంది అని భావించి మార్పులు చేసి రిలీజ్ చేయిస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడో ‘హనుమాన్ జంక్షన్’ చేసిన తమిళ దర్శకుడు, ఎడిటర్ మోహన్ రాజా గారి అబ్బాయి అయిన మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.
రాంచరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరి కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్,అనసూయ, సునీల్, బిగ్ బాస్ దివి వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. పోలీసులు, చుట్టూ పార్టీ కార్యకర్తలు ఉన్న ఏరియాలోకి బ్లాక్ కార్ వచ్చి ఆగుతుంది.
వెంటనే వైట్ అండ్ వైట్ డ్రెస్ లో సునీల్ కిందికి దిగి డోర్ తీస్తే బ్లాక్ అండ్ బ్లాక్ లో చిరు ఎంట్రీ. ఆ తర్వాత స్టైల్ గా నడుచుకుంటూ ఆయన లోపలికి వెళ్తున్నారు. దీనికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ ఫస్ట్ లుక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఒరిజినల్ లో అయితే హీరో వైట్ కలర్ షర్ట్, పంచలో ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ చిరు మాత్రం బ్లాక్ అండ్ బ్లాక్ లో మిడిల్ ఏజ్డ్ ముస్లిం మాదిరి కనిపించారు.
‘లూసిఫర్’ రీమేక్ అనగానే చిరు నుండి ఆశించినదే వైట్ కలర్ షర్ట్, పంచలో చిరు రాయల్ గా కనిపిస్తారు అని..! కానీ ఫస్ట్ లుక్ తోనే అభిమానులను డిజప్పాయింట్ చేశారు చిరు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో..! ‘ఆచార్య’ రిజల్ట్ తో ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన చిరు ఈ మూవీతో అయినా వాళ్ళని ఖుషీ చేస్తారా అనేది చూడాలి..!