బాలకృష్ణ బాటలోనే చిరంజీవి కూడా అడుగులువేస్తున్నాడు..!

బాలకృష్ణ డైరెక్షన్లో ‘నర్తనశాల’ అనే పౌరాణిక చిత్రం మొదలయ్యి.. కొంతభాగం షూటింగ్ జరుపుకున్న తరువాత ఆగిపోయింది. అయితే 17నిమిషాల ఫుటేజ్ ఉండడంతో ఏటిటి ద్వారా.. ఈ చిత్రాన్ని దసరా కానుకగా దీనిని విడుదల చేస్తున్నారు ఆ చిత్రం యూనిట్ సభ్యులు. దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య మరియు దివంగత విలక్షణ నటుడు శ్రీహరిలు నటించిన చిత్రం కూడా కాబట్టి.. అసంపూర్ణంగా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని ఓటిటిలో వీక్షించడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అంతేకాదు ఈ చిత్రం ద్వారా వచ్చిన డబ్బులను ఛారిటీకి విరాళంగా ఇప్పిస్తామని కూడా బాలయ్య తెలిపారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు బాలయ్య బాటలో చిరంజీవి కూడా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కొన్నేళ్ళ క్రితం చిరంజీవి హీరోగా ‘అబు: బాగ్దాద్‍ గజదొంగ’ అనే చిత్రం మొదలయ్యింది. కానీ నిర్మాతలు అనుకున్న దానికంటే కూడా ఈ చిత్రానికి ఎక్కువ బడ్జెట్‍ అవుతుండడం …మరోపక్క ముస్లిమ్‍ నేతల నుండీ ప్రతికూలత మొదలవ్వడంతో.. ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.

అయితే ఆ చిత్రానికి సంబంధించి కూడా కొంత ఫుటేజ్ ఉందట. దాంతో ఇప్పుడు ‘అబు: బాగ్దాద్‍ గజదొంగ’ చిత్రాన్ని కూడా ఏటిటిలో తక్కువ ధరకు టికెట్ పెట్టి విడుదల చెయ్యాలని ఆ చిత్రం నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.కనీసం మెగా అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించినా చాలా వరకూ కలెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా వారు భావిస్తున్నట్టు టాక్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus