Chiranjeevi: చిరు నిర్ణయం పై ఆందోళన చెందుతున్న అభిమానులు?

ప్రస్తుత కాలంలో ఓటీటీలకు మంచి ఆదరణ లభించడంతో ప్రతి ఒక్కరూ ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. స్టార్ సెలబ్రిటీల సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఎన్నో వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం డిజిటల్ ఎంట్రీ వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నాలుగైదు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుత కాలంలో కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని ఓటీటీలలో సినిమాలను, వెబ్ సిరీస్ లను చూడటానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం కోసం ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలని సూచించారట.అయితే మెగాస్టార్ చిరంజీవి గురించి వస్తున్నాయి వార్తలను తెలుసుకున్న అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఈయన ఇలాంటి డెసిషన్ తీసుకోవడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపిక విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నారు.

ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ అంటే అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చేదు అనుభవాన్ని మిగిల్చడమే అందుకు నిదర్శనం. ఇక మెగాస్టార్ వంటి స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారంటే ఆయనకు అనుగుణమైన కథ కావాలి. అలాంటి కథ దొరికినప్పుడే ఓటీటీలో రాణించగలరు అలా కాకుండా త్వరగా ఓటీటీఎంట్రీ ఇవ్వడం కోసం ఏదో ఒక కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే అక్కడ కూడా పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus