వైష్ణవ్ తేజ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..?

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఉప్పెన సినిమా తరువాత ఈ యంగ్ హీరోకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకోగా వైష్ణవ్ తేజ్ కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తొలి సినిమాతోనే ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుని గాల్లో తేలిపోతున్న వైష్ణవ్ తేజ్ కు మెగాస్టార్ చిరంజీవి ఆ సంతోషాన్ని రెట్టింపు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి లేఖను, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కు లేఖతో పాటు గిఫ్ట్ ను పంపిన చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ కు ఖరీదైన వాచ్ ను బహుమతిగా ఇచ్చారు. ఖరీదైన వాచ్ ను పట్టుకొని వైష్ణవ్ తేజ్ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ బహుమతిగా ఇచ్చిన ఈ వాచ్ విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ కు ప్రశంసలతో పాటు ఖరీదైన బహుమతులు దక్కుతుండటం గమనార్హం.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అందరికీ నచ్చిన ఉప్పెన 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్నా సినిమాకు షేర్ కలెక్షన్లు బాగానే వస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు సానా తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో బుచ్చిబాబు సినిమాలో హీరోగా నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపుతున్నారు. బుచ్చిబాబు తరువాత సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus