God Father: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ముఖ్యఅతిథిగా స్టార్ హీరో?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా దసరా పండుగ అక్టోబర్ 5వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకను అనంతపురంలో నిర్వహించనునట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా వేడుకను అక్టోబర్ 28వ తేదీ అనంతపురంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటలకు జరగనున్నట్లు తెలియజేశారు.

ఇక ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో తన పనిని డిస్టర్బ్ చేయొద్దు అంటూ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానించడానికి అడ్డు చెప్పారట.ఈ క్రమంలోనే మరి ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్య అతిథులుగా వస్తారు అనే విషయంపై మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. బహుశా సల్మాన్ ఖాన్ ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరుకానున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. అదేవిధంగా నయనతార వివాహమైన తర్వాత ఒక్కసారి కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ వేడుక సందర్భంగా ఈమె తెలుగు ప్రేక్షకులను కూడా కలవాలన్న నేపథ్యంలో ఈ వేడుకకు హాజరు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఈ విషయంపై ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు.ఏది ఏమైనా గాడ్ ఫాదర్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహిస్తున్నారని తెలియక అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus