గీత గోవిందం విజయోత్సవేడుకకు రానున్న చిరంజీవి

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ట్యాక్సీ వాలా చేసినప్పటికీ గీత గోవిందం సినిమానే ముందుగా థియేటర్లోకి వచ్చింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 15 న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక విజయ్ కి జోడీగా మంచి మార్కులు అందుకుంది. నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. అందుకే చిత్ర బృందం విజయోత్సవ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ఆదివారం (ఆగస్టు 19 ) హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వైజాక్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు చిరు హాజరుకావాల్సి ఉన్నింది. కానీ సినిమా రిలీజ్ కి ముందే కొన్ని సన్నివేశాలు లీక్ కావడంతో.. నిర్మాత అప్ సెట్ అయ్యారు. అల్లు అరవింద్ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో అటువంటి సందర్భంలో చిరుని ఆహ్వానించలేకపోయారు. లీక్ అయినప్పటికీ సినిమా తొలిరోజే బడ్జెట్ ని వసూలు చేయడంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. అందుకే సక్సస్ మీట్ ని వైభవంగా నిర్వహించనుంది. ఈ వేడుకకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus