Chiranjeevi: అభిమాని కోసం ఆ పని చేసిన మెగాస్టార్..?

భారత్ లో ప్రతిరోజూ దాదాపు 4 లక్షల కరోనా కేసులు నమోదవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అటూఇటుగా 20,000 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారిన పడిన వాళ్లలో చాలామంది తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఒకరు కరోనా బారిన పడగా చిరంజీవి స్వయంగా కాల్ చేసి అభిమాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ అభిమాని కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిరంజీవి ఫోన్ కాల్ లో అభిమాని ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయడంతో పాటు అధైర్యపడవద్దని,

త్వరగానే కరోనా నుంచి కోలుకుంటావని అభిమానికి ధైర్యం చెప్పారు. తాను డాక్టర్ తో కూడా మాట్లాడానని త్వరగానే వైరస్ ను జయిస్తావని చెప్పి చిరంజీవి అభిమానికి అండగా నిలిచారు. చిరంజీవి స్వయంగా కాల్ చేయడంతో అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి నుంచి తనకు కాల్ రావడం మరిచిపోలేని అనుభూతి అని అభిమాని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి పదిరోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉంది.

కరోనా కేసులు తగ్గితే పదిరోజుల షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22వ తేదీన ఈ సినిమా రిలీజవుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus