Chiranjeevi, Balakrishna: బాలకృష్ణ సినిమా కోసం చిరంజీవి ప్రచారం.. ఏ సినిమాకు? ఎప్పుడు?

నందమూరి బాలకృష్ణ (Balakrishna ) సినిమాకు చిరంజీవి (Chiranjeevi) ప్రచారమా? ఏంటీ క్లిక్‌ కోసం ఇలా రాశారా? అసలు ఇలా జరుగుతుందా? అని అనుకుంటున్నారా? మీకు ఈ డౌట్‌ రావడంలో తప్పేమీ లేదు. అయితే ఇది నిజం, జరిగింది కూడా. అయితే ఇప్పుడు కాదు 33 ఏళ్ల క్రితం. ఒక హీరో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి మరో హీరో రావడం పెద్ద గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో ఏకంగా ప్రచారం అంటే పెద్ద విషయమే కదా.

Chiranjeevi ,Balakrishna

బాలకృష్ణ చేసిన గొప్ప సినిమాల్లో ‘ఆదిత్య 369’ (Aditya 369) ఒకటి.. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొని సందడి చేశారు. ఇప్పటివారికి తెలియదు కానీ ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద విషయం. ‘ఆదిత్య 369’ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత ప్రచారం కల్పించడానికి ఆ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ దూరదర్శన్‌లో ప్రకటనలు ఇవ్వాలని అనుకున్నారట. దాని కోసం చిరంజీవి అయితే బాగుంటారు అని అనుకున్నారట. అలా ఆయన చిరంజీవిని రిక్వెస్ట్ చేస్తే.. ఆయన వెంటనే ఓకే అన్నారట.

అలా ‘ఆదిత్య 369’ సినిమా యాడ్స్‌లో చిరంజీవి నటించారు. ఆ రోజుల్లో ఈ యాడ్స్ దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. సినిమా విజయంలో భాగం కూడా అయ్యాయి. ఇప్పుడు అంటే మనం ఇలాంటివి చూడలేకపోతున్నాం. అప్పుడు చేశారు. ఇప్పుడు కూడా ఈ పని చేసే హీరోలు ఎవరైనా ముందుకొస్తే బాగుండు కదా. మొన్నీమధ్య జరిగిన బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ‘ఇంద్ర’ (Indra), ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) పాత్రలతో కథ సిద్ధం చేయాలని దర్శకులకు పిలుపునిచ్చారు.

ఈ టాస్క్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఎవరైనా ముందుకొస్తారేమో చూడాలి. ఆ రెండు సినిమాలు చేసిన బి.గోపాల్‌ (B. Gopal) అయితే ఇప్పుడు రేసులో లేరు. ఇలాంటి సినిమాలకు ఫేమస్‌ అయిన బోయపాటి శ్రీను ఏమన్నా ట్రై చేస్తారేమో. కుర్ర దర్శకులు ఎవరైనా ఈ దిశగా ఆలోచిస్తే ఇండియన్‌ సినిమాలో ఇంతకుమించిన మల్టీస్టారర్‌ ఇంకొకటి ఉండదు అని చెప్పొచ్చు.

దేవర రన్ టైమ్ వైరల్ వార్తల్లో అసలు నిజాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus