Devara: దేవర రన్ టైమ్ వైరల్ వార్తల్లో అసలు నిజాలు ఇవే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర  (Devara)   సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి కాగా ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర సినిమాకు యూఎస్, యూకేలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా యూఎస్ థియేటర్లలో బుకింగ్స్ లో దేవర రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు అని పేర్కొన్నారు. యూకే బుకింగ్స్ లో మాత్రం దేవర రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది.

Devara

అయితే దేవర మూవీ సెన్సార్ పూర్తయ్యే వరకు ఈ సినిమా రన్ టైమ్ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. దేవర సెన్సార్ పూర్తి కావాలంటే మరో 15 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. సినిమాలో రక్తపాతానికి సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ వస్తుందనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.

దేవర సినిమా గురించి అధికారికంగా కంటే అనధికారికంగా ఎక్కువ వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవర మూవీ గ్లింప్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల మెప్పు పొందడంతో దేవర మూవీ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర నుంచి ఇకపై వరుస అప్ డేట్స్ రానున్నాయి. దేవర ప్రమోషన్స్ ను సైతం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భారీ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం అద్భుతంగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సినిమాకు బాలీవుడ్ లో సైతం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నారు. దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

వరద బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. అందరి హీరోలకంటే ఎక్కువ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus