Game Changer: చిరు గొప్ప సలహాలు.. కొడుకు సినిమా విషయంలో నెగ్గలేదా?

కోవిడ్ తర్వాత సినిమా మేకింగ్ కాస్ట్.. అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకే చాలా మంది నిర్మాతలు సినిమాలు చేయడానికి భయపడుతున్నారు. నిర్మాతలు ఎక్కువగా భయపడుతుంది.. మేకింగ్ కాస్ట్ గురించే. ఎందుకంటే నటీనటుల పారితోషికాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కాబట్టి.. చెప్పింది చెప్పినట్టు తీసే దర్శకులు లేకపోతే.. నిర్మాతలు ముందడుగు వేయడం లేదు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ టైంలో చిరు చాలా గొప్ప మాటలు చెప్పారు.

Game Changer

‘సెట్స్ లోకి వెళ్ళాక నిర్మాతలతో బడ్జెట్ ఎక్కువ పెట్టించడం, ఆర్టిస్ట్..ల కాల్షీట్లు వేస్ట్ చేయించడం కంటే, పేపర్ పైనే ఫుల్ గా వర్క్ చేసి.. ఆ తర్వాత సెట్స్ కి వెళ్ళాలి అని చిరు సూచించారు. నటీనటులకు ముందుగానే డైలాగులు ఇచ్చేసి వాళ్ళతో వర్క్ షాప్స్ వంటివి చేయిస్తే.. ఔట్పుట్ బాగా వస్తుంది. అప్పుడు ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. ‘అలాగే కెమెరా యాంగిల్స్ ఎలా కావాలి?’ అనేది కూడా పేపర్ పైనే రాసుకుంటే.. పని ఇంకా ఈజీ అవుతుంది.

అప్పుడు సినిమా అనుకున్న టైంలో కంప్లీట్ అవుతుంది. అలా చేస్తే.. నిర్మాతకి డబ్బు వేస్ట్ అవ్వదు’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కానీ కొడుకు సినిమా విషయంలో చిరు మాట నెగ్గలేదు అనుకుంట. విషయం ఏంటంటే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని టాక్ సంగతి, బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ సంగతి పక్కన పెడదాం. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ‘ఆ సినిమా ఔట్పుట్ సరిగ్గా రాలేదని, రన్ టైం 5 గంటలు రావడంతో.. చాలా భాగం ట్రిమ్ చేశామని.. అందువల్ల మంచి సీన్లు పోయాయి.

అందువల్ల సంతృప్తి చెందలేదని’ శంకర్ చెప్పుకొచ్చాడు. శంకర్ వంటి సీనియర్ స్టార్ డైరెక్టర్ కి.. ఏది కావాలో క్లారిటీ లేకుండా 5 గంటల సినిమా తీయడం ఏంటి? ఫైనల్ గా దానిని 2 గంటల 45 నిమిషాలకు ట్రిమ్ చేయడం ఏంటి? అలాంటి సీనియర్ డైరెక్టర్లు ప్రెజంట్ జెనరేషన్ కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

 

Mahesh Babu, Venkatesh: పెద్దోడు సినిమాకి ఫిదా అయిపోయిన చిన్నోడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus