Mahesh Babu, Venkatesh: పెద్దోడు సినిమాకి ఫిదా అయిపోయిన చిన్నోడు!

వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నిన్న జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. రెండో రోజు కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ హౌస్ ఫుల్ బోర్డ్స్ పెడుతుంది. కచ్చితంగా ఈ సినిమా వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అంతా అభిప్రాయపడుతున్నారు.

Mahesh Babu, Venkatesh

తాజాగా మహేష్ బాబు కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా తన రివ్యూ ఇచ్చాడు. తన ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు స్పందిస్తూ.. ” ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూసి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. పండగలాంటి సినిమా. వెంకటేష్ సార్ నటన సూపర్. నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నాడు.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి..లు వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. ‘బుల్లి రాజు’ పాత్ర చేసిన బాబు అదరగొట్టేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీం అందరికీ నా అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు. ఇక పెద్దోడు సినిమాకి చిన్నోడు ట్వీట్ వేయడంపై వెంకటేష్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

తనకు నచ్చితే పక్క హీరోల సినిమాలకి కూడా మహేష్ బాబు ట్వీట్ చేస్తుంటాడు అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఉన్న హీరోల్లో మహేష్ ‘జెన్యూన్ మూవీ లవర్’ అని ఇటీవల అల్లు అర్జున్ కూడా అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.

Sankranthiki Vasthunam Collections: ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్స్.. వెంకటేష్ కెరీర్ బెస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus