Chiranjeevi: వాల్తేరు టు కోల్‌కతా.. చిరంజీవి రూటు మార్చేశాడు!

మొన్నామధ్య ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తోంది మనిద్దరమే కదా’ అని రవితేజ అన్నారు గుర్తుందా? ఆ మాటకు అచ్చంగా రూపమిస్తూ కొత్త సినిమా సెట్‌లోకి చిరు అడుగుపెట్టేశారు. అదేంటి మొన్నీమధ్యే కదా ‘వాల్తేరు వీరయ్య’ విడుదలైంది కదా అంటారా? సినిమాకు సినిమాకు భారీ గ్యాప్‌లు తీసుకునే రకం కాదు కదా బాస్‌.. అందుకే అప్పుడే సెట్స్‌లోకి అడుగుపెట్టేశారు. ఆ లెక్కన ‘వాల్తేరు’ నుండి ‘కోల్‌కతా’కు వచ్చేశారు అని చెప్పొచ్చు.

మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ అనే సినిమాలో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్‌, తమన్నా ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమా, ‘వాల్తేరు వీరయ్య’ తొలుత పారలల్‌ చిత్రీకరణ జరుపుకున్నాయి. అయితే ‘వాల్తేరు వీరయ్య’ను సంక్రాంతికి తీసుకురావాలని ‘భోళా శంకర్‌’కు గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఫుల్‌ ప్లెడ్జ్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. ఈ మేరకు చిత్రబృందం కొత్త పోస్టర్‌తో అనౌన్స్‌ చేసింది.

చిరంజీవిని మరింత మాస్‌గా, స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం ‘భోళా శంకర్‌’ అని టీమ్‌ చెబుతోంది. యాక్షన్‌, వినోదం ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయిందట. ఇక సినిమాలో చిరంజీవి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేష్ సెట్‌లో ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తున్నారని సమాచారం. అందుకు తగ్గట్టుగా సినిమా షూటింగ్‌ను వేగవంతం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక మెహర్‌ రమేశ్‌ గురించి చూస్తే.. 2009లో ‘బిల్లా’ విజయం సంగతి పక్కనపెడితే మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత 2011లో వచ్చిన ‘శక్తి’, 2013లో వచ్చిన ‘షాడో’ సినిమాలు డిజాస్టర్‌ అయ్యాయి. దాంతో మెహర్ రమేశ్‌ చాలా రోజులు కనిపించలేదు. ఇక మళ్లీ సినిమాలు చేయరా అని అనుకుంటుంగా ‘భోళా శంకర్‌’ అనౌన్స్‌ చేసి షాక్‌ ఇచ్చారు. మరి చిరు ఇచ్చిన అవకాశాన్ని మెహర్‌ రమేశ్‌ ఎంతవరకు క్యాపిటలైజ్‌ చేసుకుంటారో చూడాలి. సరైన విజయం లేని బాబి కొల్లికి ‘వాల్తేరు వీరయ్య’తో హిట్‌ ఇచ్చిన చిరు.. మెహర్‌ రమేశ్‌ కెరీర్‌ను తిరిగి పట్టాలెక్కిస్తారేమో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus