Chiranjeevi: ట్రీట్మెంట్ కోసం వైజాగ్ వెళ్లిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా కోసం పనిచేస్తున్నారు చిరు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తరువాత ‘లూసిఫర్’ రీమేక్ మీదకు వెళ్లే ముందు డీ టాక్సినేషన్, బాడీ ఫిట్ నెస్ వంటి వ్యవహారాల మీద ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం ఆయన విశాఖలోని ఓ ప్రముఖ ఆయుర్వేదిక్ స్పా రిసార్ట్ లో ఉన్నారని తెలుస్తోంది.

గతంలో కూడా ఇదే స్పాలో ఆయన వారం రోజులు గడిపారు. అప్పట్లో నిర్మాత దిల్ రాజు కూడా అక్కడే ఉన్నారు. సాధారణంగా ఈ డీ టాక్సినేషన్ కోసం మన హీరోలు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారు. కానీ గతంలో ఒకసారి, ఇప్పుడు రెండోసారి మెగాస్టార్ విశాఖకే వెళ్లారు. అక్కడ నుండి వచ్చాక ‘లూసిఫర్’ వర్క్ మొదలవుతుంది.మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు కొందరు టాలెంటెడ్ యాక్టర్స్ కనిపించనున్నారు. నయనతార కీలకపాత్ర పోషిస్తుందని సమాచారం.

కుర్ర హీరో సత్యదేవ్ ను కూడా ఈ సినిమా కోసం సంప్రదించారు. ఒరిజినల్ వెర్షన్ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో సత్యదేవ్ ను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus