తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచితనానికి మారుపేరు లాంటి హీరో ఎవరు అంటే, అందరూ క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆరోజుల్లో ఈయన నిర్మాతల పాలిట దేవుడు. తన సినిమా ఫ్లాప్ అయితే వెంటనే అదే నిర్మాతతో తదుపరి సినిమా ఉచితంగా చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు మాత్రం చాలా మంది నిర్మాతలు ఆయనకీ డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయట.
అందుకే కృష్ణ గారు తన స్టార్ స్టేటస్ కి తగ్గట్టుగా డబ్బులను సంపాదించుకోలేకపొయ్యాడు అని అందరూ అంటుంటారు. ఇది కాసేపు పక్కన పెడితే కృష్ణ అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చే కొత్త టాలెంట్ ఉన్న హీరోలను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుంటాడు. అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చి దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి లోని అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి ఆయనని ఎంతో ప్రోత్సహించేవాడట కృష్ణ. అప్పట్లో చిరంజీవి అప్ కింగ్ హీరో అయ్యినప్పటికీ కూడా కృష్ణ తనతో సరిసమానంగా ఉండే పాత్రని ఇచ్చి ‘తోడు దొంగలు’ అనే మల్టీస్టార్ర్ర్ చిత్రాన్ని చేసాడు.
ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్, చిరంజీవి కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆరోజుల్లో ఫిలిం ఛాంబర్ లో ఉండే కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి చిరంజీవి ప్రెసిడెంట్ అట. అలా అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది. చిరంజీవి కోసంగా కృష్ణ అప్పట్లో రెండు సంచలనాత్మక చిత్రాలను కూడా వదులుకున్నాడట. చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘ఖైదీ’ అనే చెప్పొచ్చు. అప్పటి వరకు నలుగురిలో ఒక హీరో గా కొనసాగిన చిరంజీవి, ఈ చిత్రం తో స్టార్ హీరో అయ్యాడు.
ఈ సినిమాని తొలుత కృష్ణ తో చేద్దాం అనుకున్నాడట డైరెక్టర్ కోదండ రామి రెడ్డి. అయితే ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో కృష్ణ ఈ చిత్రం నాకంటే బాగా చిరంజీవి కి సెట్ అవుతుంది, అతనితో చెయ్యండి అని చెప్పాడట. ఇక ఆ తర్వాత కృష్ణ కి అప్పట్లో మలయాళం లో పెద్ద సూపర్ హిట్ గా నిల్చిన ‘పూవిను పుతియా ప్యూన్ తెన్నెల్’ అనే చిత్రం తెగ నచ్చేసింది. ఈ చిత్రాన్ని మనం రీమేక్ చేద్దామని కోదండ రామి రెడ్డి తో అన్నాడట కృష్ణ.
అప్పుడు ఆయన చిరంజీవి కి కూడా ఈ సినిమా బాగా నచ్చింది అట సార్. ఆయన ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేయించే ప్రయత్నం లో ఉన్నాడని చెప్పాడట. చిరంజీవి కి ఈ సినిమా చెయ్యాలని ఆసక్తి ఉందా, అయితే నేను ఈ చిత్రం నుండి తప్పుకుంటానని చెప్పాడట. వీళ్లిద్దరి మధ్య ఆరోజుల్లో అంత అన్యోన్య సంబంధం ఉండేదట. పసివాడి ప్రాణం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అలా కృష్ణ గారు చిరంజీవి కోసం ఎన్నో త్యాగాలు చేసాడట అప్పట్లో.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు