‘వేదాలం’ రీమేక్ .. మెహర్ కు మెగాస్టార్ షరతులు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఆయన ఇమ్మీడియట్ గా మొదలుపెట్టే సినిమా ‘వేదాలం’ రీమేకే..అని తెలుస్తుంది! మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నాడు. చరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని టాక్.! ఇదిలా ఉండగా.. మెగాస్టార్ ఈ ప్రాజెక్టుని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారట.

‘మెహర్ రమేష్ అసలే ఫ్లాప్ డైరెక్టర్.. మరి మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడమేంటి? అందులోనూ సింగిల్ సిట్టింగ్ లో ఈ ప్రాజెక్టు ఓకే చెయ్యడం ఏంటి?’ అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఇక్కడ మెహర్ కు చిరు కొన్ని కండిషన్లు కూడా పెట్టారట. మెహర్ రమేష్ కు ఓ ప్లస్ పాయింట్ ఉందని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. అదేంటంటే అతను స్క్రిప్ట్ బాగా చెప్పి ఎంతటి స్టార్ హీరోతో అయినా సరే ప్రాజెక్టు ఓకే చేయించుకోగలడట. కాకపోతే మేకింగ్ విషయంలో మాత్రం నిర్మాతతో ఎక్కువ బడ్జెట్ పెట్టించేస్తాడు.

సరిగ్గా ఈ విషయం పైనే చిరు.. మెహర్ కు కొన్ని సూచనలు చెప్పారట. అవేంటంటే.. ‘ముందుగా సినిమాని అనుకున్న బడ్జెట్ లో కంప్లీట్ చెయ్యాలి. సంవత్సరాలకు.. సంవత్సరాలు తీస్తే కుదరదు… సాధ్యమైనంత తక్కువ రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. సినిమాలో పెద్ద పెద్ద నటీనటుల కోసం ఆరాటం వద్దు.. అందుబాటులో ఉండే నటీనటులతోనే ముందుకు వెళ్ళాలి’ అంటూ మెహర్ రమేష్ కు చెప్పారట చిరు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus