Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026కు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లకు పెట్టింది పేరైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తిగా పండుగ వాతావరణానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. చిరుతో జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సంక్రాంతి బాక్సాఫీస్‌పై మెగా అభిమానుల్లో ఒకింత ధీమా కనిపిస్తోంది. అయితే ప్రమోషన్ల సమయంలో చిరంజీవి కనిపించకపోవడం అభిమానుల్లో అనేక ప్రశ్నలకు దారి తీసింది. దీనికి కారణం ఆయన ఆరోగ్య పరమైన జాగ్రత్తలేనని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకూ నొప్పిని భరించి పని చేసిన చిరు, ఆ తర్వాత చికిత్స కోసం కొంత విరామం తీసుకున్నారని సమాచారం.ఇప్పుడు పరిస్థితి మెరుగుపడడంతో ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకానున్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అక్కడి నుంచి ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనే అవకాశం ఉందని టాక్.

ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడన్న వార్త కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.జనవరి 12న గ్రాండ్ రిలీజ్, 11న ప్రీమియర్లతో మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి 2026కి మెగాస్టార్ మాస్ పండుగ కానుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తీ చేసుకున్నట్టు సమాచారం. మొత్తానికి సినిమా నిడివిని 2గం.ల 42 ని.లకు లాక్ చేసారంట. సంక్రాంతి బరిలో చాల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, అనిల్ రావిపూడి – చిరు కాంబో కావడంతో అభిమానుల్లో ఈ మూవీ పట్ల అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
