కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల 2020 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కాలేదు. గతేడాది నవంబర్ నెల నుంచి షూటింగ్ లు ప్రారంభం కాగా స్టార్ హీరోలు ఇకపై కెరీర్ లో గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతున్నారు.
అయితే ఈ హీరోల కంటే వేగంగా సీనియర్ స్టార్ హీరో చిరంజీవి హీరోగా నటిస్తున్న నాలుగు సినిమాలు రాబోయే రెండేళ్లలో విడుదల కానున్నాయి. పదేళ్లు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన చిరంజీవి రీఎంట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ ఉండటం గమనార్హం. ఈ ఏడాది మార్చి నెల 13వ తేదీన చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కానుంది. ఈ సినిమాల తరువాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటిస్తున్నారు. లూసిఫర్ సినిమాకు ఎంతోమంది డైరెక్టర్ల పేర్లను పరిశీలించిన చిరంజీవి చివరకు ఈ సినిమాకు డైరెక్టర్ గా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను ఫైనల్ చేశారు.
ఈ ఏడాదే లూసిఫర్ రీమేక్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమాలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. కుర్ర హీరోల కంటే వేగంగా సినిమాల్లో నటిస్తూ ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. చిరంజీవి ప్లానింగ్ ను చూసి మెగాభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!