చిరంజీవి తల్లి అంజనా దేవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి కెరీర్ పరంగా ఈ స్థాయిలో సక్సెస్ సాధించడానికి చిరంజీవి తల్లి అంజనా దేవి కారణమని చాలామంది భావిస్తారు. అంజనా దేవి ఫేవరెట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు కావడం గమనార్హం. అంజనా దేవికి సినిమాలు అంటే ఎంతో ఆసక్తి ఉండేదని సమాచారం. అంజనా దేవి గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఏఎన్నార్ సినిమా విడుదలైతే చూసేవారట.
తల్లికి సినిమాలపై ఆసక్తి ఉండగా చిరంజీవికి కూడా సినిమాలపై ఆసక్తి ఏర్పడటం గమనార్హం. చిరంజీవికి తల్లి ప్రోత్సాహం కూడా ఉండటంతో ఆయన సినిమాల వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. మరోవైపు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గాడ్ ఫాదర్ టీజర్ కు ఒక్కరోజులోనే 8.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయని సమాచారం అందుతోంది. వాల్తేరు వీరయ్య మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ రాకపోయినా భోళా శంకర్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటన వెలువడింది.
కొన్ని నెలల గ్యాప్ లోనే చిరంజీవి నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు రీమేక్ సినిమాలు కాగా ఒక సినిమా మాత్రం స్ట్రెయిట్ సినిమా కావడం గమనార్హం. చిరంజీవి ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం.
పాన్ ఇండియా డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు పూర్తైన తర్వాతే చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని బోగట్టా.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?