భారీ క్రేజ్‌తో వచ్చిన ప్రకాష్ రాజ్ ‘వీడు సామాన్యుడు కాదు’.. సినిమా చూసిన జనాల పరిస్థితి ఏంటంటే..?

ప్రకాష్ రాజ్‌.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో పలు సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను అలరించారు.. కేవలం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగానూ అలరించారు.. 1997లో మెగాస్టార్ చిరంజీవి – గుణ శేఖర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘చూడాలని వుంది’ లో విలన్‌‌గా మెప్పించాక తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..తెలుగు నిర్మాతలంతా డేట్స్ కోసం క్యూ కట్టేవారు. దర్శకులు కూడా ప్రకాష్ రాజ్ కోసం వెయిట్ చేసేవారు..

కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా కథానాయకుడిగానూ చిత్రాలు చేయడానికి పోటీ పడేవారు.. అలా.. సీనియర్ డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణ రావుతో.. సి. కళ్యాణ్ సమర్పణలో వచ్చిన సినిమా ‘వీడు సామాన్యుడు కాదు’..రాశి, సంఘవి హీరోయిన్స్ కాగా రక్ష ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది.. విద్యా సాగర్ సంగీతం.. ‘సిరివెన్నెల’ అన్ని పాటలూ రాయగా.. లారెన్స్, అమ్మ రాజ శేఖర్ కొరియోగ్రఫీ చేశారు.. ఏవీఎస్, తనికెళ్ల భరణి లాంటి భారీ తారాగణంతో పాటు భారీ సాంకేతిక నిపుణులు పని చేశారీ చిత్రానికి..

ప్రకాష్ రాజ్ క్రేజ్ కారణంగా భారీగానే ఖర్చు పెట్టారు.. కట్ చేస్తే.. ‘వీడు సామాన్యుడు కాదు’ కి ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి.. కానీ మార్నింగ్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.. తలా తోక లేని, అర్థం కాని కథ, ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్లాష్ బ్యాక్ మళ్లీ అందులో మరో ఫ్లాష్ బ్యాక్!.. దెబ్బకి థియేటర్లలో జనాలు తలలు బాదుకున్నారు.

అసలు ప్రకాష్ రాజ్ ఎలా ఒప్పుకున్నాడు?.. ఉప్పలపాటి ఇలాంటి సినిమా డైరెక్ట్ చేశాడా?.. విద్యా సాగర్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చేవాడు?.. సిరివెన్నెల రాసిన పాట ఒక్కటి కూడా గుర్తులేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.. రెండు గంటల సినిమానే అయినా కానీ అంత సేపు కూర్చోవడం సాహసమనుకునే స్థాయిలో ప్రేక్షకులను టార్చర్ పెట్టింది ప్రకాష్ రాజ్ హీరోగా చేసిన ‘వీడు సామాన్యుడు కాదు’..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus