Chiranjeevi, Balakrishna: చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరూ నాటౌట్!

టాలీవుడ్ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ . వీరిద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే ఆ మజా ఎలా ఉంటుందో తెలిసిందే. అందులోనూ సంక్రాంతికి చిరు, బాల‌య్య సినిమాల పోటీ మామూలుగా ఉండ‌దు. చాలా యేళ్ల త‌ర్వాత వీరు 2017 సంక్రాంతికి త‌మ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల‌తో పోటీ ప‌డ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు రిలీజ్ అయ్యి రెండు సూప‌ర్ హిట్ కొట్టాయి.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ యేడాది సంక్రాంతికి కూడా మ‌రోసారి పోటీ ప‌డ్డారు. (Chiranjeevi) చిరు వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దిగారు. ఈ రెండు సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లు రాబట్టి ఇద్దరు హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల‌లో ఒకటిగా నిలిచాయి. అయితే ఇప్పుడు వీర‌య్య‌, వీర‌సింహా రెండు కూడా ఇప్పుడు 200 రోజుల భారీ రన్ పూర్తి చేసుకోవడం విశేషం.

వీరసింహా రెడ్డి సినిమా బాల‌య్య‌కు కంచుకోట అయిన సీడెడ్‌లోని ఆలూరు శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహా థియేట‌ర్లో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇక చిరు వాల్తేరు వీర‌య్య కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో 200 రోజుల ర‌న్‌ కంప్లీట్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోలా శంకర్’ మూవీలో నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా..

ఈ మూవీ ఆగస్టు 11వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అలాగే నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus