ఆడియన్స్ ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ డ్రామాలకి ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. వాళ్లకి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు కావాలి. థియేటర్లకు వచ్చి అలాంటి కంటెంట్ నే చూడాలి అనుకుంటున్నారు. ఫ్యామిలీస్ తో వచ్చి అలాంటి కంటెంట్ ను ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలకి వీఎఫ్ఎక్స్ అవసరం ఎక్కువ పడుతుంది. పెద్ద సినిమాలకు మాత్రమే కాదు… మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందే ‘హనుమాన్’ (Hanuman) వంటి సినిమాలకు కూడా వీఎఫ్ఎక్స్ అవసరం గట్టిగా పడింది.
ఫలితాలు కూడా పాజిటివ్ గా ఉండటం వల్ల… వీటి విషయంలో నిర్మాతలు, దర్శకులు కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలకి వందల కోట్లు సమర్పించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు టైం కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. దీంతో అనుకున్న డేట్ కి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్..లు, దర్శకులపై మండిపడుతూ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న పెద్ద సినిమాలు ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్'(The Rajasaab), చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) వంటి సినిమాలు… వీ.ఎఫ్.ఎక్స్ పనుల వల్ల హోల్డ్ లో పడ్డాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ కి (Hari Hara Veera Mallu) కూడా వీ.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తి కావాల్సి ఉందట. దీంతో పాటు కొంత షూటింగ్ పార్ట్ కూడా పెండింగ్లో ఉంది. అయితే దర్శకుడు రత్నం కృష్ణకి (AM Rathnam) వి.ఎఫ్.ఎక్స్ విషయంలో పూర్తి ఆవాహన ఉందట. ఒక టీంతో ఆ పనులు సమాంతరంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది.