Chiranjeevi: చిరు సోలోగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారా!

మేమంతా ఒక్కటే… ఎవరికి ఏ నష్టం వచ్చినా మేము సాయానికి ముందుకొస్తాం అని టాలీవుడ్‌ హీరోలు స్టేజ్‌లెక్కి, సోషల్‌ మీడియా వాల్స్‌ ఎక్కి చెబుతుంటారు. అయితే అలా ముందుకొస్తారా అంటే ‘అప్పుడప్పుడే’ అని చెప్పాలేమో. దీనికి తాజా ఉదాహరణ కరోనా. కరోనా కారణంగా అన్ని రంగాలతోపాటు సినిమా రంగం కూడా ఇబ్బందులు పడింది. పేద కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో వారి కోసం కరోనా క్రైసిస్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు చిరంజీవి. నటుల్లో అవసరార్థులకు సాయం చేశారు. దానికి కొంతమంది సినీ జనాలు ముందుకొచ్చి సాయం కూడా చేశారు. అయితే ఆ తర్వాత చిరంజీవి – నాగార్జున భుజానకెత్తుకున్న మరో సేవా కార్యక్రమానికి మాత్రం పెద్దగా స్పందన రాలేదు.

కరోనాకు వ్యాక్సినే విరుగుడు అని చాలా రోజుల నుండి నిపుణులు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. సెకండ్‌ వేవ్‌ వచ్చిన తర్వాత వ్యాక్సిన్‌ వేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు పెరిగారు. అయితే అందరికీ వ్యాక్సిన్‌ అందించే పరిస్థితి లేదు. దీంతో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్‌ చేపడతామని కొన్ని రోజుల క్రితం చిరంజీవి ప్రకటించారు. ఆ సమయంలో నాగార్జున ఆయన పక్కనే ఉన్నారు. అయితే ఈ విషయంలో తర్వాత ఎలాంటి చర్చలు మొదలవ్వలేదు. అయితే ఈ ప్రక్రియను చిరంజీవే సోలోగా చేస్తారనేది రీసెంట్‌ టాక్‌.

అపోలో హాస్పిటల్స్‌, ఇతర ముఖ్య ఆస్పత్రుల సహకారంతో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయించాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. కరోనా క్రైసిస్‌ ఛారిటబుల్‌ ట్రస్టు (సీసీసీ) తరఫునే ఈ కార్యక్రమం జరుగుతుందట. కానీ అవసరమయ్యే ఖర్చు చిరంజీవి భరిస్తారని అంటున్నారు. ఎందుకంటే తొలిసారి సీసీసీ తరఫున నిత్యావసరాలు పంపిణీ చేసినప్పుడు చాలామంది సినిమా జనాలు మేమున్నాం, డబ్బులు ఇస్తాం అంటూ ముందుకొచ్చారు. కానీ డబ్బులు మాత్రం ఇంకా ఇవ్వలేదట. అది గుర్తున్న చిరు… ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని సోలోగా ముందుకొస్తున్నారట.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus