Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అలా కనిపిస్తారా?

సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ మామ తరువాత బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. చిరంజీవి తండ్రీకొడుకు పాత్రల్లో ఈ సినిమాలో కనిపిస్తారని ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండేలా బాబీ స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. ఖైదీ నంబర్ 150లో డ్యూయల్ రోల్ లో నటించిన చిరంజీవి మరోసారి డ్యూయల్ రోల్ లో నటించనుండటం గమనార్హం.

బాబీ చెప్పిన కథ చిరంజీవికి ఎంతగానో నచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని చిరంజీవి ఒక వైపు లూసిఫర్ రీమేక్ లో నటిస్తూనే మరోవైపు ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిస్తారని జరుగుతున్న ప్రచారం వల్ల మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ చిరంజీవి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాబీ సినిమాతో పాటు లూసిఫర్ రీమేక్, వేదాళం రీమేక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి కొత్త కథలను కూడా వింటున్నారని సమాచారం. మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus