Chiranjeevi, Jagan: జగన్ పై చిరు ప్రశంసలకు కారణమిదేనా..?

  • June 22, 2021 / 09:55 PM IST

ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఒక్కరోజే ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయించి వార్తల్లో నిలిచింది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి ఏపీ ప్రభుత్వం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం గమనార్హం. కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను చిరంజీవి కొనియాడారు.

స్పెషల్ డ్రైవ్ పై మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేయడంతో పాటు కరోనా నియంత్రణ కొరకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆదర్శవంతమైన పరిపాలనను కొనసాగిస్తున్న జగన్ కు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి తన పోస్ట్ ను ముగించారు. జగన్ సర్కార్ ను చిరంజీవి ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. అయితే చిరంజీవి ప్రశంసలకు మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

టాలీవుడ్ శ్రేయస్సు కోరుకునే వ్యక్తులలో చిరంజీవి ఒకరనే సంగతి తెలిసిందే. త్వరలో చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించిన విషయమై జగన్ ను కలవబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ పై చిరంజీవి ప్రశంసల వెనుక ఇదే కారణమని కొందరు అభిప్రాయపడుతుంటే మరి కొందరు మాత్రం చిరంజీవి సాధారణంగానే జగన్ ను ప్రశంసించారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus