కాజల్ తో మెగాస్టార్ రొమాన్స్ సెట్ అయింది
- November 24, 2016 / 10:00 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 150 వ సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 మూవీలో రెండు పాటల కోసం చిత్ర బృందం రీసెంట్ గా యూరప్ వెళ్లి వచ్చింది. అక్కడ స్లోవేనియా, క్రోయాటియా దేశాల్లోని అందమైన ప్రాంతాల్లో చిరు, కాజల్ రెండు రొమాంటిక్ పాటలను చిత్రీకరించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్స్ ఎడిటింగ్ అయ్యే వరకు మెగాస్టార్ సరిగ్గా నిద్ర పోలేదంట. ఎడిటింగ్ కంప్లీట్ అయినా తర్వాత చూసి హమ్మయ్య అనుకున్నారని సమాచారం.
ఎందుకలా? అని ఆరా తీస్తే.. తన కంటే 30 ఏళ్ల చిన్నదైన కాజల్ తో రొమాన్స్ ఎలా ఉంటుందోనని షూటింగ్ సమయంలో మెగాస్టార్ కొంత ఆందోళన చెందారంట. ఫ్రేమ్ చక్కగా సెట్ చేశానని కెమెరా మెన్ రత్నవేలు ఎంత చెప్పినా సాటిస్ఫై కాలేదంట. పూర్తి ఎడిటింగ్ అనంతరం తనకు తాను స్వయంగా చూసుకొని ఎక్కడ ఏజ్ గ్యాప్ కనిపించలేదని అనిపించాక.. ఇప్పుడు చిరు హ్యాపీగా ఉన్నారని తెలిసింది. ఇదంతా రత్నవేలు మ్యాజిక్ అంటూ మెగాస్టార్ కితాబు కూడా ఇచ్చినట్లు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదలకానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















