మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికీ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తర్వాత నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకున్న హీరో ఎవ్వరూ లేరు. దిల్ రాజు చెప్పినట్టు.. ‘సినిమా టాక్ తో సంబంధం లేకుండా.. థియేట్రికల్ పరంగా 80 శాతం రికవరీ ఎవరి సినిమాలు సాధిస్తాయో వాళ్ళే నెంబర్ వన్’. నిజమే ఇప్పటి హీరోల సంగతి చూసుకుంటే.. సినిమాకి ప్లాప్ టాక్ వస్తే.. ఆ తర్వాతి షో నుండే జనాలు ఉండటం లేదు.
ఇక హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి ఇప్పటి స్టార్ హీరోలది. మరి చిరు ఇమేజ్ అలాంటిది కాదు. ‘శంకర్ దాదా జిందాబాద్’ కి ముందు సందర్భాన్ని బట్టి చెబుతున్న మాట ఇది. మరి ఇప్పటి సంగతేంటి? అనే డౌట్ రావచ్చు. ఇప్పటికీ ఆయన ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ‘బాహుబలి’ కాకుండా తొలి వంద కోట్లు షేర్ సాధించిన సినిమా ‘ఖైదీ నెంబర్ 150 ‘. ఆ తర్వాత ‘సైరా’ కూడా ఆ ఫీట్ సాధించింది.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ కూడా రూ.125 కోట్ల పైనే షేర్ ను సాధించింది. సో చిరు ఆ రకంగా కూడా తక్కువ కాదు. సరే ఇదంతా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. తాజాగా ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో చిరుని హైలెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ తగిలించారు. అది చాలదు అన్నట్లు ‘ ‘రంగస్థలం’ లో రాంచరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా’ అనే డైలాగ్ కూడా పెట్టారు. చిరుని హైలెట్ చేయడానికి..
ఆయన తన తమ్ముడు, తనయుడితో పోల్చుకుని తక్కువ చేసుకోవాలా అని చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరోపక్క చిరు.. ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేయాలి కాబట్టి.. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్, చెక్కుచెదరని ఫ్యాన్ ఫాలోయింగ్ ను వాడుకోక తప్పదు అనేది మరికొందరి మాట.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!