లాక్ డౌన్ సమయంలో ఎందరికో సేవలందించి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పటికీ తన సమాజ సేవ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీనికోసం తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టాడు. ప్రజలు సైతం సోనూ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ సినిమాలో సోనూతో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవి ఓ ఫైట్ సీన్ లో భాగంగా అతడిని కొట్టడానికి ఒప్పుకోలేదట. అలా చేస్తే జనాలు ఒప్పుకోరని.. అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో ఆ సన్నివేశాన్ని మార్చాల్సి వచ్చిందట.
దీంతో ఇకపై తాను విలన్ రోల్స్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు సోనూ స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఆయన ఈ విషయాలను చెప్పుకొచ్చారు. కొత్త ఏడాదిని కొత్తగా ఆరంభించాలని భావిస్తున్నట్లు.. ఇకపై తాను సినిమాల్లో విలన్ గా నటించనని చెప్పారు. తనను హీరోగా చేయమని చాలా మంది అడుగుతున్నారని.. ప్రస్తుతం తన దగ్గర నాలుగు అద్భుతమైన కథలు ఉన్నాయని చెప్పారు. ఇక ‘ఆచార్య’ షూటింగ్ లో చిరు తన దగ్గరకి వచ్చి మాట్లాడిన విషయాలను చెప్పుకొచ్చారు.
యాక్షన్ సీన్స్ లో నిన్ను కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉందని.. నిన్ను కొడితే ప్రజలు నన్ను శపిస్తారంటూ చిరుతో తనతో చెప్పిన విషయాన్ని సోనూ బయటపెట్టాడు. దీంతో ఆ సీన్ మార్చేయాల్సి వచ్చిందని సోనూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఇప్పటివరకు తాను పని చేసిన వారిలో చిరంజీవి ఎంతో సహృదయుడని.. ఎంతో స్నేహంగా ఉంటారని తెలిపారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!