మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమాగా ‘విశ్వంభర’ రూపొందుతుంది. అసలుకైతే చిరంజీవి తన పెద్ద కూతురు సుష్మిత బ్యానర్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ లో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. బీవీఎస్ రవి అందించిన కథకి బెజవాడ ప్రసన్న కుమార్ మంచిగా మెరుపులు దిద్ది స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ‘బ్రో డాడీ’ రిఫరెన్స్ తో రూపొందిన ఈ స్క్రిప్ట్ కి ‘బంగార్రాజు’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణని డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు.
ఈ సినిమాలో చిరు (Chiranjeevi) తండ్రి పాత్రలో సిద్దు జొన్నలగడ్డ కొడుకు పాత్రలో కనిపించాల్సి ఉంది.కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. చిరంజీవి 157 వ సినిమాగా అనుకున్న ‘విశ్వంభర’ 156 వ సినిమా అయ్యింది. అయితే ఇప్పుడు ఆ కథని సందీప్ కిషన్, రావు రమేష్..లతో చేయబోతున్నారు అనేది ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.
అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇది చిరు- సిద్దు..లు చేయాల్సిన కథేనని ఇన్సైడ్ టాక్. ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తారు. ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా దర్శకుడు త్రినాథరావు నక్కినకి వెంటనే ఛాన్స్ దక్కలేదు. వెంకటేష్ వంటి స్టార్ హీరోతో సినిమా అనుకున్నాడు. కానీ ఫైనల్ గా సందీప్ కిషన్ తో ముందుకు వెళ్తున్నాడు.
సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!