Chiranjeevi, Ajith: అజిత్‌ హిట్‌ పాత్ర వదులకున్న స్టార్‌ హీరోలు!

అజిత్‌ సూపర్‌స్టార్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్‌’ (తమిళంలో ‘వరళారు’) ఒకటి. మూడు రకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో అజిత్‌ అందులో నటించాడు. పరిణితి ఉన్న డాన్‌ తరహా పాత్రలో అలరించిన అజిత్‌… బృహన్నల తరహా పాత్ర మరొకటి. ఈ మూడో పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. దీని కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో దివంగత శివశంకర్‌ మాస్టర్‌ బాగా కష్టపడ్డారు కూడా.

శివశంకర్‌ మాస్టర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంలో ఆ సినిమా కోసం, అజిత్‌ పోషించిన మూడో (నాట్యకారుడు) పాత్ర కోసం ఎంత కష్టడ్డారో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పాత్రను తెలుగులో పోషించమని స్టార్‌ హీరోలను అడిగితే… ఒకరు కుదరదు అని చెప్పారని, ఇంకొకరు చేస్తాను అని చెప్పి తర్వాత చేయలేదని అన్నారు. వాళ్లే చిరంజీవి, బాలకృష్ణ. నాట్యకారుడి పాత్రను చేయమని బాలకృష్ణను అడిగారట.

దానికి పెద్ద ఎన్టీఆర్ బృహన్నల వంటి పాత్రను చేశారు కదా. మీరూ ఈ పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పారట శివశంకర్‌ మాస్టర్‌. దానికి బాలయ్య… ‘ఆ పాత్ర నిప్పు లాంటిది. ఆ పాత్ర చేస్తే నిప్పులో చెయ్యి పెట్టినట్లే. కొన్ని పాత్రలు చూసి ఆనందించాలంతే! చేయకూడదు’ అని అన్నారట. ఇక చిరంజీవి ని సంప్రదిస్తే… చేద్దాం అన్నారు. కానీ ఎందుకో ఆ తర్వాత పక్కన పెట్టేశారని శివశంకర్‌ మాస్టర్‌ చెప్పారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus