Chiranjeevi Remuneration: నిమిషయం యాడ్‌కి చిరంజీవి అంత తీసుకున్నారా?

గట్టిగా చూస్తే ఒక నిమిషయం యాడ్‌… కానీ ఇంపాక్ట్‌ చూస్తే అదిరిపోయింది. ఇదంతా ఏ యాడ్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. మొన్నీ మధ్య విడుదలైన ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి సంబంధించిన యాడ్‌ గురించే. ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన యాడ్‌ ఇది. ఇందులో కంటెంట్ ఏంటనేది కాకుండా, చిరంజీవి కామిక్‌ టైమింగ్‌, ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆ యాడ్‌కి ఆయన ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ అయిపోతారు.

ఆ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యాడ్‌ను చిరంజీవితో సుకుమార్‌ చేయించారు అనే విషయం తెలిసిందే. చిరంజీవి కామిక్‌ టైమింగ్‌, సుకుమార్‌ నెరేషన్‌తో యాడ్‌ అదిరిపోయింది. ఏంటీ అంత చిన్న యాడ్‌లో ఇవన్నీ ఉన్నాయా అంటారా? ఉన్నాయి మరి. కావాలంటే మీరే చూడండి. ఖుష్బూ కూడా నటించిన ఈ యాడ్‌లో హాట్‌ యాంకర్‌ అనసూయ కూడా కనిపించింది. నిజానికి ఈ ముగ్గురే యాడ్‌లో ప్రధానంగా కనిపిస్తారు. ఇదంతా పక్కనపెడితే.. ఈ యాడ్‌ కోసం చిరంజీవి గట్టిగానే పారితోషికం అందుకున్నారని టాక్‌.

రూ. ఆరు కోట్ల నుండి రూ. 7 కోట్ల వరకు చిరంజీవి రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే కుర్ర స్టార్‌ హీరోలు కూడా ప్రస్తుతం యాడ్స్‌ చేస్తున్నారు. గతంలో చిరంజీవి థమ్స్‌ అప్‌ యాడ్‌ చేశారు. అప్పుడు కూడా భారీగానే అందుకున్నారు. ఆ రోజుల్లో చిరుకి ఇచ్చిన రెమ్యూనరేషన్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఆయన యాడ్‌ చేయడడం, అది కూడా షాకింగ్‌ రెమ్యూనరేషన్‌ అవ్వడంతో మరోసారి యాడ్‌ రంగంలో చర్చ మొదలైంది.

ఇదే జోష్‌లో చిరంజీవి మరికొన్ని యాడ్స్‌ చేస్తారేమో చూడాలి. సినిమాల్లో ఇలాగే రీఎంట్రీ ఇచ్చిన వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి యాడ్స్‌లో కూడా చిరు ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనిపించుకుంటారేమో చూడాలి. డేనియల్‌ శేఖర్‌ స్టైల్‌లో చెప్పాలంటే ‘బాస్‌ నీ ఫ్యాన్స్‌ వెయిటింగిక్కడ’.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus