Chiranjeevi: అంచనాలను ఆకాశానికి ఎత్తేసిన పూరి.. వైరల్ అవుతున్న చిరు ట్విట్?

  • July 22, 2022 / 11:26 AM IST

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం లైగర్.విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇకపోతే నేడు ఉదయం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని సుదర్శన్ థియేటర్లో నిర్వహించారు. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..

అంచనాలను ఆకాశానికి ఎత్తేసాడు పూరీ జగన్నాథ్. ఇదిగో లైజర్ ట్రైలర్ అంటూ ఈయన చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.ఇలా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించడం, ట్రైలర్ తన ట్విట్టర్ ద్వారా చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం లైగర్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో మాస్ క్యారెక్టర్ లో నటించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమా ద్వారా నిజంగానే విజయ్ దేవరకొండ ఇండియాని షేక్ చేసేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ ట్రైలర్ చూస్తుంటేనే సినిమాపై అంతకుమించి అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus