Chiranjeevi: చిరంజీవి పెళ్లి వెనుక అల్లు రామలింగయ్య కుట్రను బయటపెట్టిన మెగాస్టార్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యనటుడిగా పేరు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సీనియర్ కమెడియన్లు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది అల్లు రామలింగయ్యతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం అల్లు రామలింగయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మొదటిసారి తాను మన ఊరి పాండవులు సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో ఆయనని కలిసాను ఆ సమయంలో నన్ను ఏ ఊరు మీది అని అడిగారు.

ఇలా రామలింగయ్య గారు అడిగేసరికి చాలా ఊర్లో తిరిగి వచ్చామని చెప్పాను.ఆరోజు షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆయన నన్నే గమనిస్తున్నారు అయితే క్యాజువల్ గా చూస్తున్నారనుకున్నాను కానీ ఆ చూపుల వెనుక ఏదో కుట్ర ఉందని తర్వాత తెలిసింది అంటూ వారి పెళ్లి గురించి మాట్లాడారు.అల్లు రామలింగయ్య నన్ను చూస్తూ నా మనస్తత్వం, నా ప్రవర్తన ఎలా ఉందని గమనిస్తూ ఉన్నారు. ఒకరోజు అల్లు రామలింగయ్య రావు గోపాల్ రావు మేమంతా ట్రైన్ లో వస్తున్నాము అందరూ కలిసి మందు బాటిల్స్ ఓపెన్ చేశారు.

నన్ను ఓ పెగ్ వేయమని అడిగారు కానీ నాకు అలవాటు లేదని చెప్పి పడుకున్న అప్పుడు నాకు తెలియకుండానే ఒక మార్క్ టిక్ పడింది.ఇలా ప్రతి విషయంలోనూ నన్ను గమనిస్తూ వచ్చినటువంటి ఈయన చివరికి తన పెళ్లి గురించి కూడా ప్రస్తావించారు.నిర్మాత జయ కృష్ణ వచ్చి తన పెళ్లి గురించి మాట్లాడటంతో ఇప్పుడే కెరియర్ ప్రారంభమైంది పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం కావాలని చెప్పేశాను. అయితే ఆయన మా నాన్నకు మాయమాటలు చెప్పి చివరికి పెళ్లి చూపులకు వెళ్దామని నన్ను ఒప్పించారు.

ఎలాగైనా ఈ పెళ్లి చూపులకి వెళ్లి నో అని చెప్పాలనుకున్న కానీ సురేఖని చూసేసరికి నో చెప్పలేకపోయానని పెళ్లి చూపుల సమయంలో నన్ను ఒక బలిచ్చే పొట్టేలును తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన పెళ్లి విషయంలో జరిగిన కుట్ర గురించి బయట పెట్టారు.అయితే అల్లు రామలింగయ్య గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారని ఒక కొడుకును ప్రొడ్యూసర్గా పరిచయం చేసి మరొక కొడుకుని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు అయితే ఆయన చనిపోవడంతో ఆయనని తనలోనే చూసుకున్నారని తనని ఎంతో ఆదరించారంటూ ఈ సందర్భంగా చిరంజీవి అల్లు రామలింగయ్య గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus