Chiranjeevi: ఎంతైనా సంపాదిస్తాను.. అంతా దాని కోసమే:చిరు

చిరంజీవి నటనలోనే కాదు, సేవాగుణంలో మెగాస్టార్‌ అని చెప్పొచ్చు. అగ్ర హీరోగా ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చిరు.. సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు. ఛారిటీ కింద బ్లడ్‌ బ్యాంక్‌, ఐబ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంకు అంటూ సగటు ప్రజలకు సాయం చేస్తుంటారు. అయితే చిరంజీవి ఛారిటీ వెనుక ఉన్న కథేంటి? ఈ విషయం చాలా తక్కువమందికే తెలుసు. ఇటీవల ఆ విషయాల్ని చిరంజీవి చెప్పుఒకచ్చారు. మెగాస్టార్ చిరంజీవి పాతికేళ్ల క్రితమే బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు.

ఆ తర్వాత ఐబ్యాంక్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కరోనా సమయంలో ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. సీసీసీ పేరుతో కరోనా కష్టకాలంలో నటులకు, కొంతమంది మీడియా ప్రతినిధులకు సాయం చేశారు. అందుకే, చిరంజీవి సేవాగుణం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఆయన్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు ఆయన ఛారిటీ, సేవల గురించి మెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ ఇంతగా దానాలు చెయ్యడం వెనుక ఓ కారణం ఉంది. కెరీర్‌లో స్టార్‌ డమ్‌ చూసిన గొప్ప గొప్ప నటులు, దర్శక, నిర్మాతలు తమ చివరి దశల్లో చాలా కష్టాలు పడ్డారు.

అవసరమైనప్పుడు డబ్బులు చేతిలో ఉండకు ఆర్థిక ఇబ్బందులు కూడా చూశారు. ఎంత సంపాదించినా చివరికి ఏమీ కూడబెట్టుకోలేకపోయారు. అందుకే, నటుడిగా నాలుగు డబ్బులు సంపాదిస్తున్న సమయంలో మా వారికి ఆస్తులు కూడబెట్టాలి అన్నట్లుగా ఉండేవాణ్ని. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. అందుకే ఇప్పుడు నేను కూడబెట్టాల్సింది ఏమీ లేదు అని అర్థం చేసుకున్నాను అని చెప్పారు చిరు.

అందుకే అవసరమైన వారికి సాయం చేయడానికి ముందుకొస్తున్నాను. ఇకపై నా జీవితం ఛారిటీకే అంకితమిస్తున్నాను. ఎంతైనా దానం చేయడానికి సిద్ధం. చేస్తున్న సినిమాల ద్వారా వస్తున్న డబ్బు ఛారిటీకే ఉపయోగిస్తున్నా అని చెప్పారు చిరంజీవి. ఈ మాటలు విన్న చిరంజీవి అభిమానులు మా మెగాస్టార్‌ మనసు వెన్న అంటూ పొంగిపోతున్నారు. ఎంతైనా కష్టం తెలిసి, బాధలో తడిసి, తేరుకున్న కళ్లు అవి.. ఆ మాత్రం ఉంటుందిలెండి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus