టాలీవుడ్ లో అప్పటి తరం హీరోల్లో ఎన్టీఆర్, నాగేశ్వర రావ్….కృష్ణ, శోభన్ బాబు…ఇలా ఎందరో నటులు తమ పాత్రలతో నటించి, జీవించి…తెలుగు తెరకు వన్నె తెచ్చారు…అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో ఆ బడా హీరోల తరువాత వచ్చిన తరం హీరోల్లో చిరు మంచి పేరు సమాపాదించుకున్నారు…స్వయంకృషితో ఎదిగిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…అయితే ఆయన నటనకు అభిమానులు బ్రహ్మ రధం పట్టడంతో మెగాస్టార్ గా మారి…మంచి హీరోగా టాలీవుడ్ లో ఎన్నో హిట్స్ అందుకున్నాడు…ఇక తరువాత రాజకీయ అరంగేట్రం చేసి…అక్కడ పెద్దగా కలసి రాక…మళ్లీ…చివరకు ముఖానికి రంగులు వేసుకున్నాడు…అయితే 150వ సినిమా అంటూ భారీ హంగామా అయితే చేసి మళ్లీ రిటర్న్ అయ్యాడు కానీ…సినిమా ఆశించినంత హిట్ కాలేదు…వసూళ్ల పరంగా ఒకే అనిపించింది…ఇదిలా ఉంటే అదే క్రమంలో బుల్లి తెరపై కూడా చిరు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు….కానీ అక్కడ పెద్దగా కలసి రావడంలేదు…మీలో ఎవరు కోటీశ్వరుడు షో…ఫ్లాప్ షో గా ముద్రపడడంతో సెలెబ్రెటీస్ తో కధ నడిపించేస్తూ ఉన్నాడు.
అయితే ఈ కార్యక్రమంలో ఒకానొక ఎపిసోడ్ లో చిరు మాట్లాడుతూ…తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఓ కోరిక మిగిలిపోయిందని తెలిపాడు….ఏ పాత్ర అంటే…స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పాత్ర ఆట…ఆ పాత్రను…వెండితెరపై పోషించాలని కలలుకన్నాను. కానీ అనివార్య కారణాల వల్ల ఆ కోరిక తీరలేదు అని తన మది లోని బాధని వెళ్ళగక్కారు….దేశం కోసం ప్రాణాలను అర్పించిన అలాంటి గొప్ప వీరుడి పాత్రలో నేను నటించలేకపోయాననే బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది. భగత్‌సింగ్ పాత్రలో నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల అది చేజారిపోయింది అంటూ బాధ పడ్డాడు…అయితే కామెడీ క్యారెక్టర్స్ ను అవలీలగా పోషించగల చిరు…ఇలాంటి సీరియస్ పాత్రలు చెయ్యడం కాస్త కష్టం అనే చెప్పాలి….అదీ మ్యాటర్….!!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.